25-09-2025 12:08:44 PM
హైదరాబాద్: తెలంగాణ అంతటా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హైదరాబాద్ అంచనా వేసింది. ఐఎండీ హైదరాబాద్ ప్రకారం, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భారీ రుతుపవనాల వర్షాలు కాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అటు ములుగు జిల్లాలోని(Heavy rains) పలు మండలాల్లో గురువారం ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. వెంకటాపురం, వాజేడు, మంగపేట, ఏటారునాగారం, తాడ్వాయి, ములుగు(Mulugu), గోవిందరావుపేట, మల్లంపల్లి మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు.