03-05-2025 07:21:42 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన 28 ఏళ్ల మహిళపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లి, కోడుకు ఉంటున్న ఓ ఇంట్లో 28 ఏళ్ల మహిళ పని మనిషిగా పని చేస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో మైనర్ బాలుడిని ప్రలోభపెట్టి, లైంగికంగా వేధించి, బెదిరించినట్లు ఆమెపై అభియోగం మోపబడిందని పోలీసులు పేర్కొన్నారు. మహిళపై బాలుడి తల్లి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. దీని ఆధారంగా లైంగిక నేరాల నుంచి పల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.