calender_icon.png 18 September, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్చార్జి ఎంపీడీవోగా పొదిళ్ల శ్రీనివాస్

18-09-2025 12:46:31 PM

మంగపేట,(విజయక్రాంతి): మంగపేట మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న పొదిళ్ల శ్రీనివాస్ కు మంగపేట ఇన్చార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా నియమిస్తూ జడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.గురువారం  పొదిళ్ల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు పొదిళ్ల శ్రీనివాస్ ఇన్చార్జి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపి సంతోషాన్ని వ్యక్తం చేశారు.