calender_icon.png 18 September, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ నాయకుల సేవా గుణం

18-09-2025 12:47:51 PM

మంగపేట,(విజయక్రాంతి): రాజకీయాల్లో సేవాగుణం కలిగి ఉండాలి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన ఉండాలి అప్పుడే పార్టీకి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అందుకే ఆ దిశలో వెళ్తున్న మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) ప్రజలకు అతి చేరువలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబమని వెలుగెత్తి చాటుతున్నారు.సేవా దృక్పథంతో మంగపేట గ్రామానికి చెందిన కోడం సోమమ్మ ఇటీవల మృతి చెందగా బుధవారం సోమమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి  మనో ధైర్యాన్ని చెప్పి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షులు టీవీ హిదయతుల్లా మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చాత మల్లయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ మాజీ జెడ్పిటిసి సిద్ధంశెట్టి వైకుంఠం సీనియర్ నాయకులు తోట తిరుపతి యూత్ నాయకులు గగ్గూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.