12 June, 2026 | 12:22 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

హెచ్‌సీయూలో కవితా పోటీలు

19-03-2026 02:27 AM

ఉగాది సందర్భంగా నిర్వహణ

హైదరాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): హైదరాబాద్ విశ్వవిద్యాలయంలోని తెలుగుశా ఖ ఆధ్వర్యంలో బుధవారం ఉగాది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సభాధ్యక్షులుగా తెలు గు శాఖాధ్యక్షులు ఆచార్య పిల్లలమర్రి రాములు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ఉగాది ఉత్సవాలలో భాగంగా విద్యార్థుల సృజనాత్మక శక్తిని కళా నైపుణ్యాలను వెలికి తీయడం కోసం కవితా రచన, పద్య రచన, పాట ల పోటీలు, పద్య పఠనం, కథ రచన, వ్యాసరచన వక్తృత్వం పోటీలు నిర్వహించామని అన్నా రు.

ఈ సందర్భంగా ఆయన స్వయంగా రాసి ఆలాపించిన “విశ్వావసుకు వీడ్కోలు పరాభవానికి ప్రార్ధన” అనే జయగీతం సభలోని వారం దరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఉపకులపతి ఆచార్య జె. అనురాధ మాట్లాడుతూ.. తెలుగుశాఖ అంటే తనకి ఎంతో మక్కువని అన్నారు. హ్యుమానిటీస్ డీన్ ఆచార్య ఎన్ టి అన్సారి మాట్లాడుతూ.. సాంస్కృతిక అభినయం, సాహిత్య వైభవం ఉట్టిపడే విధంగా ఈ వేదిక ఎంతో ఆకర్షణియంగా ఉండి కనులవిందు చేస్తుందని అన్నారు.

రిజిస్ట్రార్ ఆచార్య డాక్టర్ దేవేశ్ నిగమ్ మాట్లాడుతూ.. ఉగాది ఉత్సవాలు ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థులకు ఉపకులపతి ఆచార్య అనురాధ బహుమతులు అందజేశారు. తెలుగుశాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, ఆచార్య ఎం గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య డి విజయలక్ష్మి, ఆచార్య పి వారిజారాణి, ఆచార్య వి త్రివేణి, ఆచార్య భూక్య తిరుపతి, డాక్టర్ బి. భుజంగరెడ్డి, డాక్టర్ బాశెట్టి లత, డా.విజయకుమారి పాల్గొన్నారు.