14 April, 2026 | 9:07 PM

జిల్లా కలెక్టర్‌ను కలిసిన పోలీస్ కమిషనర్ అనురాధ

19-06-2025 12:35 AM

కొండపాక, జూన్ 18: సిద్దిపేట జిల్లాకు ఇటీవల బదిలీపై వచ్చిన కలెక్టర్ కె.హైమావతిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ బుధవారం కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు జిల్లాలోని పరిస్థితులపై చర్చించారు. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రజలకు మేలైన సేవలు అందించాలని చర్చించారు. కమిషనర్ వెంట జిల్లా అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీబీ రవీందర్ రెడ్డి ఉన్నారు.