calender_icon.png 12 November, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో పోలీసుల ముమ్మర తనిఖీలు

12-11-2025 12:10:30 AM

కామారెడ్డి, నవంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, వివిధ రద్దీ ప్రదేశాలలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. సోమవారం ఢిల్లీలో పేలుడు జరిగిన దృష్ట్యా ముందస్తు చర్యలుగా ఈ తనిఖీలు చేపట్టారు. అనుమానిత వ్యక్తులు అనుమానాస్పద వస్తువులు వాహనాలు కల్పించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోరారు.