calender_icon.png 12 November, 2025 | 2:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రోన్లు, సీసీ కెమెరాల నీడలో పోలింగ్

12-11-2025 12:11:11 AM

900 సీసీటీవీ కెమెరాలతో ఐసీసీసీ నుంచి పర్యవేక్షించిన సీపీ సజ్జనార్

కోడ్ ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, నేతలపై కేసులు

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 11 (విజయక్రాంతి): రాష్ర్టవ్యాగ్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని హైదరాబాద్ నగర సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. పోలింగ్ సరళిని ఆయన మంగళవారం బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఐసీసీసీ నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.

దేశంలోనే తొలిసారిగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తూ పోలింగ్ స్టేషన్ల వద్ద పరిస్థితిని వీక్షించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రజలు స్వే చ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని పో లింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్ర తా ఏర్పాట్లు చేశాం. పోలింగ్ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగిందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదే శాల మేరకు దేశంలోనే తొలిసారిగా డ్రోన్ టెక్నాలజీని వినియోగించామని చెప్పారు.

మొత్తం 150 డ్రోన్ కెమెరాల ద్వారా పోలింగ్ కేంద్రాల పరిసరాలను నిరంతరం గమనించామని, దీనికి అదనంగా 900 సీసీటీవీ కెమెరాల ద్వారా అన్ని పోలింగ్ స్టేషన్లను ఐసీసీసీ నుంచి రియల్ టైమ్ మానిటరింగ్ చేశామని చెప్పారు. కాగా నియోజకవర్గానికి చెందని స్థానికేతర ప్రజాప్రతినిధులు పోలిం గ్ కేంద్రాల వద్ద ప్రచారం చేస్తూ తిరుగుతున్నారన్న సమాచారంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, మెతుకు ఆనంద్‌పై బోరబండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.