30 May, 2026 | 2:47 AM

వన్యప్రాణుల వేటగాళ్లపై పోలీసుల ఉక్కుపాదం

30-05-2026 12:00 AM

* నలుగురు వేటగాళ్ల అరెస్ట్.... 

ఆదిలాబాద్, మే 29 (విజయక్రాంతి) : వన్య ప్రాణులను వేటాడే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పోలీసులు దాడులు నిర్వహిస్తూ ఇప్పటికే పలువు రిని అరెస్టు చేయగా తాజాగా మరో నలుగురు వేటగాళ్ల ను పట్టుకున్నారు. శుక్రవారం ఇచ్చోడ రూరల్ సీఐ సి.హెచ్ రమేష్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

గుడిహత్నూర్ మండల పరిధిలోని చిన్న మన్నూరు అటవీ ప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లిన నలుగురు వ్య క్తులను గుడిహత్నూర్ ఎస్త్స్ర, సిబ్బంది అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 కత్తులు, 50 ft పొడవు గల ఒక ఉచ్చు , రెండు మోటార్ సైకిళ్లు, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఈ కేసులో అల్లకుంట లకన్,అల్లకుంట తాళయ్య, అల్లకుంట తిరుపతి,అల్లకుంట నాగయ్య అరెస్టు చేశామన్నారు.

నిందితులపై గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. వన్యప్రా ణు లను వేటాడడం, వాటికి హాని కలిగించడం చట్టరీత్యా నేరమని, అటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజలు వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని, అనుమా నాస్పద వ్యక్తులు లేదా వేట కార్యకలాపాల గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. ఈ మీడి యా సమావేశంలో గుడిహత్నూర్ ఎస్త్స్ర ఎ ల్ శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.