1 September, 2026 | 1:25 AM

పౌర హక్కుల అవగాహన సదస్సు

01-09-2026 12:00 AM

పాల్గొన్న తాహసీల్దార్ మహమ్మద్ అసదుల్లా ఖాన్

సికింద్రాబాద్, ఆగస్టు31 (విజయక్రాం తి): కంటోన్మెంట్ పరిధిలోని ఈస్ట్ మారేడుపల్లి వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్లో రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మారేడుపల్లి తాహసీల్దార్ మహమ్మద్ అసదుల్లా ఖాన్ నేతృత్వంలో దళిత్, బహుజన్ ఫ్రంట్ రిసోర్స్ సెంటర్కు చెందిన నళిని, మారేడుపల్లి పోలీస్ శాఖ నిర్వహించిన పౌర హక్కుల అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగాపౌరుల హక్కులు, వాటి పరిరక్షణ, చట్టాలపై అవగాహన మరియు సామాజిక బాధ్యతలపై విలువైన అవగాహన కల్పించడం జరిగింది. అనంతరం తా హసీల్దార్ మహమ్మద్ అసదుల్లా ఖాన్ తాసిల్దార్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హ క్కులను తెలుసుకుని వాటిని పరిరక్షించుకోవడంతో పాటు సమాజంలో సమానత్వం, న్యాయం, సోదరభావం పెంపొందించేందు కు కృషి చేయాల్సిన అవసరం ఉంది అన్ని తాహసీల్దార్ తెలిపారు.