27-10-2025 06:18:33 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): క్రికెట్ పోటీలలో సుల్తానాబాద్ గర్ల్స్ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ జి ఎఫ్ ఐ) ఆధ్వర్యంలో జె ఎన్ టి యు కళాశాలలో నిర్వహించిన పెద్దపల్లి జిల్లా స్థాయి 14, 17 సంవత్సరాల బాలబాలికల క్రికెట్ పోటీలలో సుల్తానాబాద్ గర్ల్స్ హైస్కూల్ పాఠశాల విద్యార్థులు 17 సంవత్సరాల విభాగంలో టీ.వైష్ణవి, సాత్విక 14 సంవత్సరాల విభాగంలో టీ. దిశాంత్ అత్యంత చక్కటి ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి దివాకర్, ఫిజికల్ డైరెక్టర్ జి.వెంకటేష్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అభినందించారు.