21 April, 2026 | 3:44 PM

Breaking News

33% మహిళా రిజర్వేషన్ లో సామాజిక న్యాయం పాటించాలి   •   అభిమాని కుమారుడు కేశఖండనానికి వెళ్లిన ఎమ్మెల్యే   •   జీవన్ రెడ్డి.. పచ్చి తెలంగాణ వ్యతిరేకి.. వెయ్యి ఏండ్లయినా BRS పార్టీ మారదు   •   విద్యార్థులకు మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించండి   •   ఘనంగా గ్రాడ్యుయేషన్ డే   •   రెండున్నరేళ్లలో రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు తెలంగాణ జాగృతి యువత పాదయాత్ర ప్రారంభం   •   ఏసీబీకి పట్టుబడిన ఆర్డీవో   •   పాతికేళ్ల అజ్ఞాతం అనంతరం సొంతూరుకు చేరిన ‘బడే’   •   కాటారంలో రైతు భరోసా సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు   •  

పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు

31-03-2025 11:19 PM

ఎస్ఐని ఢీకొట్టిన కారు..

పటాన్ చెరు: పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో వచ్చిన కారును ఆపే ప్రయత్నం చేయగా... ఆపకుండా ఎస్ఐ ని ఢీకొట్టి పరారయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలలోకి వెళ్తే... జిన్నారం ఎస్ఐ నాగలక్ష్మి సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం జిన్నారం శివారులోని ఎంపీడీవో కార్యాలయం వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. మంగంపేట నుంచి జిన్నారం వైపు వస్తున్న వాహనాలను ఆపి వాహనం నడుపుతున్న వారికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో మద్యం సేవించి కారు నడుపుతున్న వ్యక్తిని ఎస్ఐ విచారిస్తున్న క్రమంలో మరో కారు దూసుకొచ్చింది. కారును ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవగా ఎస్ఐ నాగలక్ష్మిని ఢీకొట్టి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ లు కారును వెంబడించగా లక్మీపతి గూడెం సమీపంలో కారును వదిలి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. ఎస్ఐ నీ ఢీకొట్టిన కారు ఏపీ 12 పీ 0003, కారు పోలీస్ ల అదుపులో ఉంది.