calender_icon.png 17 July, 2025 | 10:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల్లో చైతన్యానికే పోలీసు భరోసా..

17-07-2025 12:18:07 AM

పెన్ పహాడ్: విద్యార్థులలో తమ భవిష్యత్ ప్రణాళికలు, కుటుంబ నేపథ్యం, సమాజంలో సముచిత స్థానం లాంటి చైతన్యం  చేయడానికే పోలీసు భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ ప్రసన్న కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని కస్తూరిభా గాంధీ గురుకుల పాఠశాలలో పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాలికలు, మహిళలపై జరిగే ఆఘాయిత్యాల నివారణ చర్యలు, బాలికలు, మహిళల రక్షణకై పోలీస్ శాఖ కట్టుబడి ఉందని వారిపై ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 

చిన్నపిల్లలు, బాలికలపై లైంగిక దాడి చేసినా లేదా వేధింపులకు గురిచేసిన వారిపై వెంటనే రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వారి ప్రవర్తన మార్చుకోకుండా పదేపదే లైంగిక దాడి చేస్తే పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపుతామన్నారు.బాలికలు మహిళలు ఏదైనా ఆపద  సమయంలో డయల్ 100 లేదా1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి   పోలీసులు వారికి  సమాచారం ఇచ్చి  తక్షణమే సహాయం పొందాలని సూచించారు.