08-12-2025 10:34:02 PM
ఫ్లాగ్ మార్చ్ నిర్వహణ..
చివ్వెంల (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చివ్వెంల మండలంలోని చివ్వెంల, చందుపట్ల గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి పోలీసులు భారీగా ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈరోజు రెండు గ్రామాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విశాలమైన ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. గ్రామ ప్రజల్లో నమ్మకం కల్పించడం, ఎన్నికల సమయంలో చట్టవ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేయడానికి పోలీసుల సిద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబించింది. ఫ్లాగ్ మార్చ్‌లో డీఎస్పీ వి. ప్రసన్నకుమార్, సీఐ రాజశేఖర్, ఎస్సైలు మహేశ్వర్, రత్నం, అలాగే పెనపహాడ్, ఆత్మకూరు ప్రాంతాల ఎస్సైలు, సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. చివ్వెంల, చందుపట్ట గ్రామాల ప్రధాన వీధులు, కేంద్ర బజార్లు, అడ్డా ప్రాంతాలు మీదుగా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ప్రజలకు డీఎస్పీ, సీఐ సూచనలు:
ఎన్నికలను శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి గ్రామస్థుడు సహకరించాలి.
ఎన్నికల కమిషన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
ప్రచారం నిబంధనలను ఉల్లంఘించకుండా సాఫీగా నిర్వహించాలి.
ఎన్నికల అనంతరం ఎలాంటి విజయ ఊరేగింపులు చేయరాదని స్పష్టం చేశారు.
చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
పోలీసుల పటిష్ట భద్రతా ఏర్పాట్లు
చివ్వెంల, చందుపట్ల గ్రామాల్లో ఎన్నికల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలు నియమించినట్లు అధికారులు తెలిపారు. రాత్రి పగలు పహారాలు, మొబైల్ టీమ్‌లు, ఇంటింటికి అవగాహన కార్యక్రమాలు, సస్పిషియస్ మూమెంట్స్‌పై కంటిన్యూయస్ మానిటరింగ్ వంటి చర్యలను చేపట్టినట్లు వివరించారు. ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా సాగేందుకు పోలీసుల సంసిద్ధత పూర్తి స్థాయిలో ఉందని అధికారులు తెలిపారు.