08-12-2025 10:29:25 PM
తనిఖీల్లో పాల్గొన్న వరంగల్ సీపీ..
హనుమకొండ (విజయక్రాంతి): వరంగల్ సీపీ ఆదేశాల మేరకు ట్రైసిటీ పరిధిలో పోలీసు సిబ్బంది సోమవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని కాలనీలను దిగ్బంధం చేసి ముమ్మరంగా సోదాలు చేశారు. అనుమానిత వ్యక్తుల వాహనాలు, ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. హంటర్ రోడ్ లో నిర్వహించిన తనిఖీల్లో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. గోపాలపురం క్రాస్ రోడ్, ఎర్రగట్టు గుట్ట కిట్స్ కాలేజీ క్రాస్ రోడ్ వద్ద కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో సెంట్రల్ జోన్ డిసిపి ధారా కవిత, హనుమకొండ ఏసిపి. పి .నరసింహారావు, కేయూ సిఐ ఎస్. రవికుమార్, ఎస్సై శ్రీకాంత్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.