08-12-2025 06:15:07 PM
తానూర్ (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తానూర్ మండల కేంద్రంలో సోమవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేందుకు ప్రజలందరికీ పోలీసులు ఎల్లవేళలా తోడుంటారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధైర్యంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలు చైతన్యవంతులై ప్రజాస్వామ్య ఓట్లు వినియోగించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు పోలీసులు పాల్గొన్నారు.