08-12-2025 06:22:00 PM
బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ చల్మెడ లక్ష్మీ నరసింహారావు..
వేములవాడ (విజయక్రాంతి): వేములవాడ అర్బన్ మండలం చింతల్ తానా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి శేర్ల మురళి ఇటీవల గుండెపోటుకు గురై అకస్మాత్తుగా మృతి చెందారు. వారి కుటుంబాన్ని సోమవారం బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. వారి వెంట సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్లు విజయ్, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, పోతు అనిల్ కుమార్, సత్తిరెడ్డి, రాధాకిషన్ రావు, నాయకులు రవి, హరికృష్ణ, ప్రమోద్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.