ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు..
హుజూర్ నగర్ ఓల్డ్ బస్ స్టాండ్ లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు..
హుజూర్ నగర్: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సూర్యాపేట జిల్లా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాలను పోలీసులు తనిఖీలు చేపట్టారు. హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసు, ఓల్డ్ బస్టాండ్, కూరగాయల మార్కెట్, షాపింగ్ మాల్స్, ప్రయాణికుల లగేజ్‌తో పాటు పార్సిల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐ చరమందరాజు మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు అప్రమత్తమై తనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దేశభద్రతకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లయితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్సై అన్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






