11-11-2025 07:51:44 PM
మండల పీఎసిఎస్ చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి..
కోయిల్ కొండ: రైతులకు ఎల్లప్పుడూ ప్రజాపాలన ప్రభుత్వం అండగా నిలబడుతుందని మండల పీఎసిఎస్ చైర్మన్ జి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో వింజమూర్, సంగనోనీ పల్లి, బూరుగుపల్లి, తిరుమల పల్లి, ఉబర్ తండాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను అందుబాటులో ఉంచడంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అండగా నిలబడాలని సంకల్పంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అంశాన్ని రైతులు గమనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జి రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల విద్యాసాగర్ గౌడ్, సీనియర్ నాయకులు సత్యపాల్ రెడ్డి, రాజు నాయక్, రవి నాయక్, నాయకులు పాల్గొన్నారు.