10 April, 2026 | 2:25 PM

Breaking News

బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •   యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం సాధ్యం   •  

డ్రగ్స్ నివారణకై ఇల్లెందులో సైకిల్ ర్యాలీ నిర్వహించిన పోలీసులు

25-10-2025 02:52 PM

ఇల్లెందు, (విజయక్రాంతి): డ్రగ్స్ నివారణకై పోలీస్ శాఖ చేపట్టిన చైతన్య యుద్ధంలో భాగంగా విద్యార్థులతో ఇల్లెందు పట్టణంలో శనివారం  పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా విద్యార్థులు పోలీసులు డ్రగ్స్ సేవించడం విక్రయించడం చట్ట రీత్యా నేరం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ర్యాలీలో ఇల్లెందు డీఎస్పీ ఎన్ చంద్రబాను, సీఐ తాటిపాముల సురేష్, ఎస్సైలు సూర్య, హసీనా విద్యార్థులతో కలిసి సైకిల్ తొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు యువత డ్రగ్స్ నివారణకు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. యువత విద్యార్థులు డ్రగ్స్ డ్రగ్స్ పై చుట్టుపక్కల ప్రజలకు అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత తెలంగాణకు కృషి చేయాలని సూచించారు.