25-10-2025 02:53:29 PM
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం నుండి బెల్లంపల్లి మండలం లోని శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వరకు నవంబర్ 5 న చేపట్టనున్న మహా పాదయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్ర ను విజయవంతం చేయాలని మహా పాదయాత్ర నిర్వాహకులు రామటెంకి దుర్గరాజ్ కోరారు. శనివారం పట్టణం లోని పాత బస్టాండ్ లో మహా పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు.
పాదయాత్ర ఉదయం 8.30 గంటలకు పాలచెట్టు ప్రాంతం లోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం నుండి ప్రారంభమవుతుందని, పాదయాత్రలో పాల్గొనే భక్తులకు భగవద్గీత అందించ బడుతుందని తెలిపారు. పాదయాత్రలో పాల్గొనే భక్తులకు కన్నాల రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కమాన్ వద్ద అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు.కార్తీక మాసం సందర్భంగా ఈ పాదయాత్రను చేపడు తున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో న్యాయవాది రెడ్డిరాజుల రాములు, ధర్మజాగరణ ప్రముఖ పైడిమల్ల అరుణ్ కుమార్, జాడి సత్యన నారాయణ,బానేష్ లు పాల్గొన్నారు