14 April, 2026 | 5:06 PM

Breaking News

రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •  

శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలి

27-12-2025 07:02 PM

- ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్

సిద్దిపేట క్రైం: శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఏఆర్ అదనపు డీసీపీ  సుభాష్ చంద్రబోస్ సూచించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం స్థానిక పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీస్ పరేడ్‌ను నిర్వహించారు. పరేడ్‌ను పర్యవేక్షించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీసు శాఖలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం అత్యంత ప్రధానమని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నిరంతర సాధన అవసరమని సూచించారు. ప్రజలకు చేరువగా ఉంటూ, తక్షణ సహాయం అందించడంలో ముందుండాలన్నారు. ఈ పరేడ్‌లో సిద్దిపేట టౌన్, ట్రాఫిక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది  పాల్గొన్నారు.