calender_icon.png 27 December, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ

27-12-2025 07:06:11 PM

కాసిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి సరిత, ఉప సర్పంచ్ గోపు శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ పార్వతి మల్లేష్, మాజీ ఉప సర్పంచ్ ఉడుతల రాజన్నలతో కలిసి మూగ జీవాలకు మందులు వేశారు.

అనంతరం పశువైద్యాధికారి సరిత మాట్లాడుతూ... వర్షాకాలం, శీతాకాలం తర్వాత గొర్రెలు, మేకలకు వచ్చే అంతర్గత పరాన్న జీవుల వల్ల కలిగే నష్టాలను నివారించడానికి నట్టల మందు వేయించడం ఎంతో అవసరమన్నారు. సకాలంలో మందులు వేయడం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగుపడి, గొర్రె కాపరులకు ఆర్థిక లాభం చేకూరుతుందన్నారు. పశు పోషకుల సంక్షేమమే ధ్యేయంగా నట్టల నివారణ మందులు వేస్తున్నామని ఉప సర్పంచ్ గోపు శ్రీనివాస్ అన్నారు.

పశువుల ఆరోగ్యం పట్ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత మందులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. గ్రామంలోని గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకకుండా ముందస్తుగా ఈ నివారణ చర్యలు చేపట్టామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గొర్రెలు, మేకల పెంపకం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నట్టల నివారణ మందులను గొర్రె కాపరులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.