1 August, 2026 | 1:05 AM

పేకాట శిబిరంపై పోలీసుల దాడి

01-08-2026 12:00 AM

గట్టు, జూలై 31: గట్టు మండలంలోని బోయలగూడెం శివారులో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఈ దాడిలో మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు గట్టు ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.44,110 నగదు, 6 మొబైల్ ఫోన్లు, 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. మండల పరిధిలో అక్రమ కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచి, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.