జాన్సన్ గ్రామర్ స్కూల్ ముంపు సమస్య పరిష్కారానికి త్వరలో చర్యలు
ఉప్పల్ జూలై 31 విజయక్రాంతి: ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న నాచారం డివిజన్ లో ఉన్న జాన్సన్ గ్రామర్ స్కూల్ పరిసరాల ముంపు సమ స్య పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ అధికారు లు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ గత రెండు రోజులుగా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో, గురువారం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటి వ్ ఇంజనీర్ సాయి పృథ్వి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరజ్లు కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిపై స్పందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమేష్ బాబు, సమస్య పరిష్కారానికి సంబంధించి సుమారు రూ.35 లక్షల వ్యయంతో ప్రతిపాదనలు ఇప్పటికే జోనల్ కమిషనర్ వద్ద ఉన్నాయని, వాటికి త్వరలో ఆమోదం తీసుకొని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.






