12 August, 2026 | 2:40 AM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

12-08-2026 12:43 AM

గుండ్ల చెరువు వద్ద ముగ్గురు పట్టివేత.. రూ.28 వేల నగదు స్వాధీనం

దోమకొండ, ఆగస్టు 11 (విజయక్రాంతి): దోమకొండ మండల పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు దాడి చేశారు. గుండ్ల చెరువు సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.28,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్త్స్ర ప్రభాకర్ ఆధ్వర్యంలో పోలీసులు ఈ దాడి నిర్వహించారు. అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు గుండ్ల చెరువు వద్దకు చేరుకుని ఆకస్మికంగా దాడి చేశారు.

పోలీసులను గమనించినప్పటికీ తప్పించుకునే అవకాశం లేకపోవడంతో ముగ్గురు పట్టుబడ్డారు. వారి వద్ద ఉన్న పేకాట సామగ్రితో పాటు నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పేకాటకు దూరంగా ఉండాలి

ఈ సందర్భంగా దోమకొండ ఎస్‌ఐ ప్రభాకర్  మాట్లాడుతూ.. జూదం గెలుపు కాదు.. జీవితాన్ని ఓడించే వ్యసనం అని పేర్కొన్నారు. పేకాట, ఇతర జూదాలకు అలవాటు పడటం వల్ల ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబాల్లో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.

ముఖ్యంగా యువత పేకాటకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు. మండల కేంద్ర ంలో పేకాట, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్త్స్ర ప్రభాకర్ హెచ్చరించారు.