13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

వ్యభిచార కేంద్రంపై పోలీసుల దాడి.. ముగ్గురి అరెస్ట్

31-03-2026 01:18 AM

సనత్‌నగర్, మార్చి ౩౦ (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఆదివారం సాయంత్రం బి.కె.గూడ ప్రాంతంలో వ్యభిచారం జరుగుతున్నట్లు నమ్మదగిన సమాచారం ఎస్.ఆర్.నగర్ పోలీసులకు అందింది.

దీంతో పోలీసులు చేసిన దాడిలో ప్రధాన నిందితుడు బైరెడ్డి రమేష్‌రెడ్డి (45), సబ్ ఆర్గనైజర్ తుత్తూరు వంశీ (24), కస్టమర్ గంకిడి లక్ష్మణ్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. వీరు మధ్యవర్తుల సహాయంతో మహిళలను సమకూర్చి డబ్బుల కోసం వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో బెంగళూరుకు చెందిన మరియం (25), అంజనా దాస్ (18) అనే ఇద్దరు మహిళలను పోలీసులు రక్షించారు. ఈ వ్యవహారంలో చైతన్య అనే సప్లయర్ పరారీలో ఉన్నాడు. దాడి సమయంలో మూడు మొబైల్ ఫోన్లు, రూ.2,150 నగదు, యాక్టివా ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్.ఆర్. నగర్ పోలీసులు వెల్లడించారు.