13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ఎస్సీల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం

31-03-2026 01:19 AM

రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం కుమార్

ముషీరాబాద్, మార్చి 30(విజయక్రాంతి): తెలంగాణలో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి, కాంగ్రెస్ ప్రభుత్వం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం కుమార్ స్పష్టం చేశారు. ఎస్సీల సంక్షేమ పథకాల సాధన కోసం ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో సోమవారం మహాధర్నా నిర్వహించారు.

ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన  మాట్లాడుతూ.. దళితుల ఆర్థిక సామాజిక సాధికారతకు ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఎస్సీల విద్య ఉపాధి వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని,  అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపయ్య మాదిగ మాట్లాడుతూ  ఎస్సీలమం తా ఏకమవుదాం 20% రిజర్వేషన్లపై ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. 

ఎమ్మార్పీఎస్ ఆధ్వ ర్యంలో ఏప్రిల్ 7, 8, 9 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలోని ఎమ్మెల్యేకి తమ డిమాండ్లను, వినతి పత్రాలను జిల్లా మండల గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే. దాసిమోహన్, రాష్ట్ర యువసేన అధ్యక్షులు యాదగిరి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బొల్లం జ్యోతి, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగారం బాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, వివిధ జిల్లాల అధ్యక్షులు నాయకులు పాల్గొన్నారు.