13 April, 2026 | 2:30 AM

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

13-04-2026 01:07 AM

ఏడుగురు అరెస్ట్, 5 మొబైల్ ఫోన్లు, రూ.7,710 నగదు స్వాధీనం

కామారెడ్డి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): పేకాట జీవితాలను చిన్నబిన్నం చేస్తుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఆదివారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

వారి వద్ద నుంచి రూ 7,710 నగదు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల ఉక్కు పాదం కొనసాగుతుందన్నారు. అక్రమ పేకాట స్థావరాలపై పోలీసుల నిఘా  కొనసాగుతుందన్నారు. పేకాట అనేది కేవలం ఒక్క వేసనం మాత్రమే కాదు అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి అని అన్నారు. చనికానందం కోసం పేకాటకు బానిసలైతే అది అప్పులోబులోకి నెట్టు చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారి తీస్తుందన్నారు.

ప్రజలు ముఖ్యంగా యువత ఇటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండి బాధ్యతయుత పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా  కొనసాగుతుందన్నారు. పేకాట ఎక్కడైనా ఆడిన సాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన పోలీసులకు సమాచారం ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. 100 డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.

 జూదం అనేది కేవలం ఒక వ్యసనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం యొక్క ఆర్థిక పునాదులను కూల్చే సామాజిక మహమ్మారి. క్షణికానందం కోసం జూదానికి బానిసలైతే, అది అప్పుల ఊబిలోకి నెడుతూ, చివరికి ఆత్మహత్యల వంటి దారుణ పరిణామాలకు దారితీస్తుంది. ప్రజలు, ముఖ్యంగా యువత, ఇటువంటి అక్రమ మార్గాలకు దూరంగా ఉండి బాధ్యతాయుత పౌరులుగా తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్ గారు స్పష్టం చేశారు. రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇసన్నపల్లి  గ్రామ శివారులో అక్రమంగా జూదం ఆడుతున్నట్లు అందిన సమాచారం మేరకు, ఎస్త్స్ర రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మెరుపు దాడి నిర్వహించారు.

ఈ దాడిలో జూదం ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7,710 నగదుతో పాటు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రజలు నిర్భయంగా ముందుకు వచ్చి సమాచారం అందించాలని పోలీస్ శాఖ కోరుతోంది. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇవ్వడానికి సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు కాల్ చేయవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని జిల్లా ఎస్పీ తెలిపారు.