ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం సనాతన ధర్మం
జుక్కల్ పీఠాధిపతి గోపాల్ రాందాస్ మూలే
కామారెడ్డి, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ప్రపంచ దేశాలకు ఆదర్శనీయమైనది మన సనాతన ధర్మం అని జుక్కల్ పీఠాధిపతి గోపాల్ రాందాస్ మూలే అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ లో ఆదివారం కాకతీయ బస్తి హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జుక్కల్ పీఠాధిపతి గోపాల్ రాందాస్ మూలే హాజరై మాట్లాడారు. ప్రపంచ దేశాలకు ఆదర్శం మన సనాతన ధర్మమని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యమని అన్నారు. ఆర్ ఎస్ ఎస్ జిల్లా ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ మాట్లాడుతూ గోవులను రక్షించుకునేందుకు కూడా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అదే విధంగా చిన్నారులు, బాలికలు, మహిళలు, చివరకు వృద్ధులపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించే చట్టాలు వచ్చే వరకు తన పోరాటం ఆగదని అన్నారు.
ప్రాచీన విలువలు, వేదాలు, యోగ, ధర్మ సూత్రాలను అర్థం చేసుకుని, ఆచరించడం గొప్ప విషయం అన్నారు. ప్రకృతిని గౌరవించడం, సత్యం, అహింస, నిస్వార్థ సేవ వంటి సద్గుణాలను అలవర్చుకోవలన్నారు. ధర్మాన్ని పరిరక్షించవచ్చు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో ధర్మాన్ని ఆచరిస్తూ, భావితరాలకు అందించాలన్నారు. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతి హిందువు కనీస బాధ్యతగా గుర్తించల్లన్నారు. ఐక్యమత్యంతో సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. హైందన సనాతన ధర్మాని కాపాడుకోవడం ప్రతి హిందువు కనీస ధర్మమని, ఐకమత్యంతో దాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాలన్నారు.
హైందవ ధర్మం జోలికి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభమేళలో లక్షలాది మంది సన్యాసులు, సిద్ధు లు, మునులు పాల్గొన్నారని, హద్దులు మీరితే హైందవ ధర్మాన్ని కాపాడేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని, తాము ప్రాణ త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రయ సేవిక సమితి అధ్యక్షురాలు సరోజన, హిందూ సమ్మేళనం అధ్యక్షురాలు లక్ష్మి నర్సయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందు ప్రియా, కౌన్సిలర్లు రాంశెట్టి హర్షిత, అర్కాల ప్రభాకర్ యాదవ్, రాహుల్ గౌడ్, వినోదబాయ్, ఆర్ ఎస్ ఎస్, హిందూ సమ్మేళనం ప్రతినిధులు పాల్గొన్నారు.




