calender_icon.png 26 June, 2025 | 3:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసముద్రం పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు గ్రీన్ సిగ్నల్

26-06-2025 10:32:27 AM

అడ్మిషన్ల ప్రక్రియ షురూ

మహబూబాబాద్,(విజయక్రాంతి): 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన కేసముద్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాలకు అనుమతి ఇచ్చిందని పాలిటెక్నిక్ ఓఎస్డి డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి తెలంగాణ పాలిసెట్ ఆధారంగా ప్రవేశాలు ప్రారంభమయ్యాయని, అర్హత గల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

అందుబాటులో ఉన్న కోర్సులు:

1. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 

2. ఎంబెడెడ్ సిస్టమ్స్ 

3. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మరియు మిషన్ లెర్నింగ్ 

4. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఈవీ టెక్నాలజీ 

ఈ నాలుగు కోర్సులు విద్యార్థులకు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగ అవకాశాలు అందించే విధంగా రూపొందించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఈవీ టెక్నాలజీ లాంటి ఆధునిక రంగాల్లో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థులు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడతారన్నారు.

టీజీ పాలీసెట్ – 2025 అడ్మిషన్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు:

మొదటి దశ: బేసిక్ సమాచారం, ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్: 24-06-2025 నుండి 28-06-2025 వరకు

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 26-06-2025 నుండి 29-06-2025 వరకు

ఆప్షన్ ఎంపిక: 26-06-2025 నుండి 01-07-2025 వవరకు

ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్: 01-07-2025

అంతిమ సీట్లు కేటాయింపు: 04-07-2025 లోగా

ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్: 04-07-2025 నుండి 06-07-2025 వరకు 

తుదిదశ:

స్లాట్ బుకింగ్ మరియు ఫీజు చెల్లింపు: 09-07-2025 నుండి 10-07-2025 వరకు

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 11-07-2025

ఆప్షన్ ఎంపిక: 11-07-2025 నుండి 12-07-2025 వరకు

ఫ్రీజింగ్: 12-07-2025

సీట్లు కేటాయింపు: 15-07-2025 లోగా

ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్: 15-07-2025 నుండి 16-07-2025 వరకు

కాలేజీలో రిపోర్టింగ్: 15-07-2025 నుండి 17-07-2025 వరకు

తొలి తరగతుల ప్రారంభం: 18-07-2025

ఇంటర్నల్ స్లైడింగ్, స్పాట్ అడ్మిషన్లు:

ఇంటర్నల్ స్లైడింగ్ (మరే శాఖకు మారడానికి): 21-07-2025 నుండి 22-07-2025 వరకు

సీట్లు కేటాయింపు: 24-07-2025 లోగా

సరికొత్త శాఖలో రిపోర్టింగ్: 24-07-2025

స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల: 23-07-2025

స్పాట్ అడ్మిషన్ల ముగింపు తేదీ: 30-07-2025

అభ్యర్థులకు సూచనలు:

టీజీపాలిసెట్- 2025 సంబంధిత పూర్తి వివరాలు,సూచనలు, హెల్ప్‌లైన్ సెంటర్ లిస్ట్, కోర్సుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో  https://tgpolycet.nic.in అందుబాటులో ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు.

త్వరగా స్లాట్ బుక్ చేసుకొని, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులకు ఎక్కువ ఆప్షన్లు ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు టీజీ పాలీసెట్ ప్రక్రియను ఉపయోగించుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.