21-01-2026 08:06:09 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్ ఎక్సైజ్ డివిజన్ పరిధిలోని గూడెం, బెజ్జూర్ వైన్ షాపులు బుధవారం ఎక్సైజ్, టాస్క్ పోలీస్ అధికారులు సీజ్ చేశారు. మద్యం దుకాణాల్లో ఎక్సైజ్,టాస్క్ ఫోర్స్, స్థానిక ఎక్సైజ్ అధికారుల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుపుతున్నట్లు తేలడంతో ఇరు దుకాణాలపై కేసు నమోదు చేసిన ఆబ్కారీ శాఖ అధికారులు. గూడెం రేణుక వైన్స్, బెజ్జూర్ తిరుమలమణికంఠ వైన్స్ ల పై కేసు నమోదు చేసి సీజ్ చేసినట్లు కాగజ్‌నగర్ ఎక్సైజ్ సీఐ వి.రవి, తెలిపారు.ఈ సోదాల్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ సీఐ బిక్షారెడ్డి, ఎస్సై సురేష్, లోపానంద్, హెడ్ కానిస్టేబుల్ అంబాజీ, కానిస్టేబుల్ కుమార్ స్థానిక ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.