21-01-2026 08:03:58 PM
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల పట్టణం ఇంగ్లీష్ యూనియన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో బుధవారం ఉదయం రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా పాఠశాలకు ముఖ్యఅతిథిగా సహాయక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రజనీదేవి హాజరుకావడం జరిగింది. పాఠశాల విద్యార్థులకు ముఖ్య సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రమాదాలలో ఎక్కువగా యువకులు మరణించడం జరుగుతుంది.
కుటుంబానికి ఆశా కిరణంగా ఉన్న యువకుడు తల్లిదండ్రులకు ఇష్టమైన ప్రతిరూపమైన కుమారులు కుమార్తె పిల్లల భవిష్యత్తుకు ఆధారమైన తండ్రి అనేక ప్రమాదాలలో చనిపోవడం జరుగుతుంది మోటర్ వెహికల్ పై ముగ్గురు రైడింగ్ చేయకూడదు మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి18 సంవత్సరములు నిండి ఉన్నవారే బైక్ నడపాలి అని చెప్పడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు విధిగా తప్పకుండా హెల్మెట్ ధరించాలి కారు నడుపుతున్నప్పుడు విధిగా సీట్ బెల్ట్ ధరించాలి రోడ్డుపై నడుస్తున్నప్పుడు క్రాస్ చేయాలనుకున్నప్పుడు జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు క్రాస్ చేయాలని చెప్పడం జరిగింది.
పాఠశాల కరస్పాండెంట్ రాజ్ కుమార్ రాజిరెడ్ది లు మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్సు తప్పకుండా పాటించాలి అని చెప్పడం జరిగింది రెడ్లైట్ విధిగా ప్రయాణంఆగుము అని ఎల్లో లైట్ ప్రయాణంసిద్ధంగా ఉండమని గ్రీన్ లైటు ప్రయాణం చేయుమని సూచిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా నేషనల్ హైవేలలో వేగం లిమిట్ ప్రకారమే నడపాలని డ్రైవర్లకు సూచించడం జరిగింది మనం పాటించే ఒక నియమము చూపించే ఒక జాగ్రత్త అందరి కుటుంబాలను ప్రమాదాలు నుండి కాపాడుతుంది రోడ్డు భద్రత మాసోత్సవాలు ఒక నెలరోజుల పాటు కాకుండా సంవత్సరం పొడవునా కొనసాగించినట్టయితే బాధ్యతలో ఒక భాగంగా అనుసరిస్తారు అని చెప్పడం జరిగింది.
దానిలో భాగంగా మనం మారితే మన కుటుంబం మారుతుంది మన కుటుంబం మారితేసమాజ మారుతుంది సమాజం మారితే దేశము మొత్తం మారుతుంది. దేశం మారితే దేశ ప్రజలందరూ సంరక్షణంగా ఉంటారని చెప్పడం జరిగింది దీనిని యువకులందరూ ఆదర్శంగా తీసుకొని ప్రమాదాల బారిన పడకుండా అందరూ భాగస్వాములు కావాలని చెప్పడం జరిగింది. నియమ నిబంధనలు తెలిపాక పాఠశాల పిల్లలతో రోడ్డు భద్రతతో ఉంటామని తల్లిదండ్రులతో అన్ని విషయాలు తెలుపుతామని మేముకూడా పాటిస్తామని ప్రతిజ్ఞ చేపించారు ఇట్టి కార్యక్రమంలో రవాణా శాఖ సిబ్బంది కానిస్టేబుల్ రమ్య సౌమ్య పాఠశాల సిబ్బంది ఎ ఎం వి ఐ రజిని రెండు పాఠశాలల ప్రిన్సిపల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పి ఈ టీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.