calender_icon.png 21 January, 2026 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనిషి బాగున్నప్పుడే ఏ పనైనా సాధ్యం

21-01-2026 08:11:21 PM

పీసరి బాలమణి కృష్ణారెడ్డి

సొంత నిధులతో దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు పంపిణీ

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): మనిషి బాగున్నప్పుడే ఏ పనైనా సాధ్యమని భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. జాతీయ సుపరిపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారి వాజ్ పేయి జయంతి సందర్భంగా భౌరంపేట్ మాజీ కౌన్సిలర్ పీసరి బాలమణి కృష్ణారెడ్డి సొంత నిధులతో గత ఆరు సంవత్సరాలుగా దివ్యాంగులకు ఉచితంగా బస్ పాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మనిషి అన్ని అవయవాలు బాగుండి కూడా నిరాశతో కాలయాపన చేస్తుంటారని అన్నారు.

ప్రమాదవశాత్తు ఒక మనిషి అంగవైకల్యం చెందితే వారు పడే బాధ వర్ణనాతీతం అని తెలిపారు. 50 మందికి పైగా బస్ పాసులు అందివ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం బస్ పాసుల లబ్ధిదారులు మాట్లాడుతూ... తాము బస్ పాసులు అప్లై చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఎక్కడో కోఠికి, జూబ్లీకి గాని వెళ్లాల్సి వస్తోందని ఆవేదనకు వ్యక్తం చేశారు. మా ఇబ్బందులను అర్థం చేసుకొని, మాకు ఇలాంటి సదుపాయం కల్పించిన పీసరి బాలమణి కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి,బీజేపీ సీనియర్ నాయకులు నల్ల రామచంద్రారెడ్డి, గోనె మల్లారెడ్డి, దమ్మగారి ప్రభాకర్ రెడ్డి, డి. సీతారాం రెడ్డి, పి. శంకర్ అప్ప తదితరులు పాల్గొన్నారు.