calender_icon.png 14 February, 2026 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిశువు అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

14-02-2026 12:00:00 AM

సికింద్రాబాద్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):  సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు నాలుగు నెలల పసికందు బాలిక అపహరణ కేసును ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ నెల 10న రాత్రి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భిక్షాటన చేస్తుండగా బాధితురాలితో పరిచయం పెంచుకున్న ఓ పురుషుడు, ఓ మహిళ ఆహారం, బట్టలు కొనిచ్చి పాట్నీ, బండిమెట్ మార్కెట్ ప్రాం తాలకు తీసుకెళ్లారు.

అనంతరం టవల్ కొనుగోలు చేయాలని చెప్పి ఆమెను రోడ్డు దాట మని పంపించి, ఆమె నాలుగు నెలల పాప ను అపహరించి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మార్కెట్ పోలీసులు దర్యాప్తు చేపట్టి  సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పాపను అపహరించిన గోగ వెంకయ్య (30), మునగాల శీరిష (28)లను అరెస్టు చేశారు.

వీరి వద్ద నుంచి బజాజ్ పల్సర్ ద్విచక్రవాహనం, రెండు సెల్ ఫోన్లు స్వాధీ నం చేసుకున్నారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ ఎస్. ఎం. బషీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు మార్కెట్ ఇన్‌స్పెక్టర్ వీ.రామచందర్ తెలిపారు.