calender_icon.png 16 February, 2026 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులు సక్సెస్

16-02-2026 07:31:22 PM

సీఐ, ఎస్సైలకు భక్తుల అభినందనల వెల్లువ

ధర్మపురి,(విజయక్రాంతి): మునుపెన్నడూ లేనట్లుగా ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో పోలీసులు ఈసారి సక్సెస్ ఫుల్ స్ట్రైక్ రేట్ సాధించారు.  సీఐ రాం నరసింహారెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ లు ఉన్నత పోలీస్ అధికారులచే శభాష్ అనిపించుకున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడిక్కడ భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తులచే శభాస్ అనిపించుకున్నారు.

వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాన్ని ఆలయం ఆవరణలో  ఏర్పాటు చేశారు.పండుగ సందర్భంగా ఎలాంటి అవాoచనీయ సంఘటనలు జరగకుండా ధర్మపురి సీఐ రాం నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఉదయ్ కుమార్  పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘాట్ పరిసర ప్రాంతాల్లో నిరంతర పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. దీనితో సీఐ రాం నర్సింహా రెడ్డి, ఎస్సై ఉదయ్ కుమార్ లకు భక్తులచే అభినందనల వెల్లువ విరజిల్లింది.