17 April, 2026 | 8:26 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసుల నిఘా

26-11-2025 05:38 PM

నూతనకల్ (విజయక్రాంతి): ​గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున, బుధవారం డీఎస్పీ ప్రసన్నకుమార్ ఆధ్వర్యంలో నూతనకల్ ఎస్సై నాగరాజు మండలంలోని సమస్యాత్మక గ్రామాలలో పర్యటించారు.​​ మండల పరిధిలోని మిర్యాల, చిల్పకుంట్ల, తాళ్ల సింగారం గ్రామాలలో ఎన్నికల పోలింగ్ బూతులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పరిస్థితులను, ఎన్నికల వాతావరణాన్ని పర్యవేక్షించారు. ​అనంతరం గ్రామస్తులతో సమావేశమై ఎన్నికల నియమావళికి కట్టుబడి ఉండాలని, పౌరులు పాటించాల్సిన ప్రవర్తనా నియమాలు గురించి అవగాహన కల్పించారు.​

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ఎన్నికలు ప్రజాస్వామ్య సమాజంలో పండుగ లాంటివి అని అభివర్ణించారు. ప్రతి ఒక్కరూ ఎలాంటి గొడవలు, విభేదాలు పెట్టుకోకుండా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని, ఎన్నికల సమయంలో కేసులు నమోదైతే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు ఎదురవుతాయని, ముఖ్యంగా యువత ఈ విషయంలో ఆదర్శంగా ఉండాలని సూచించారు.ప్రతి ఒక్కరూ తమ స్వేచ్ఛాయుత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని,ప్రజల భద్రత, రక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని, ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని, ఎవరూ చట్ట ఉల్లంఘనకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.