26-11-2025 05:40:43 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని భీమన్న గుట్ట భూ ఆక్రమణలకు గురవుతుందని జిల్లాలోని ముదిరాజులు ఆర్డీవో కార్యాలయం ముందర సేవ్ భీమన్న గుట్ట అని శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బుధవారం రోజు ముదిరాజులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా ముదిరాజ్ కోర్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్ సమీపంలో గల దాదాపు 63 ఎకరాల భీమన్న గుట్ట ప్రాంతం భూ అక్రమణాలకు గురవుతుందని పేర్కొన్నారు.
కొన్ని వందల సంవత్సరాలుగా కొలుస్తున్న ముదిరాజుల ఆరాధ్య దైవం భీమన్న దేవుడికి కొలిచే ప్రాంతం, పండ్ల తోటల పెంపకంతో తమ జీవనాధారంగా ఉన్న భీమన్నగుట్ట ఉందన్నారు గుట్ట ఆక్రమణకు గురవుతున్న అధికారులు పట్టించుకోకపోవడంతో విమల గుట్ట ప్రాంతాన్ని భూకబ్జా చేస్తున్నారని అన్నారు. తమకు కేటాయించిన భూమిని ముదిరాజులకు ఇప్పించాలని జిల్లావ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నామని అన్నారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని జిల్లా ముదిరాజులు అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు, జిల్లాలోని ముదిరాజులు, మహిళలు పాల్గొన్నారు.