13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కఠిన చర్యలు

23-03-2026 09:26 PM

- 66 మందికి జరిమానాలు

వెంకటాపూర్,(విజయక్రాంతి): మండలంలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక వాహన తనిఖీలు ఫలితాన్నిచ్చాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి సోమవారం పోలీస్ స్టేషన్‌లో కౌన్స్లింగ్ నిర్వహించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం, కుటుంబాలపై పడే ప్రభావం వంటి అంశాలను పోలీసులు వారికి వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు చేయవద్దని గట్టిగా హెచ్చరించారు.

అనంతరం మొత్తం 66 మందిని జిల్లా కోర్టుకు తరలించగా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వారి కేసులను విచారించి తగిన జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఎస్సై చల్లా రాజు మాట్లాడుతూ.. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టవిరుద్ధమేకాక ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు సహకరించి సురక్షిత రవాణాకు తోడ్పడాలని కోరారు.