చిన్నారులకు పోలియో చుక్కలు తప్పని సరి..
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల టౌన్, జూన్ 28: జిల్లాలోనీ ఐదేండ్లలోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని మంచిర్యాల ఎం ఎల్ ఏ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో మంచిర్యాల మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ లో చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.
వివిధ కారణాలతో ఈ రోజు పిల్లలకు చుక్కలు వేయించని పిల్లలకు 29, 30 తేదీలలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సహకరించి ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






