calender_icon.png 5 December, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ కొబ్బరి మట్ట నరదిష్టి

05-12-2025 01:25:45 AM

తెలంగాణ నరదృష్టి వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్

స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. మండిపడుతున్న కాంగ్రెస్ 

పెదవి విప్పని బీజేపీ

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : పంటలు ఎందుకు ఎండిపోతా యి?.. తెగుళ్లవల్ల, అని ఏ రైతును అడిగినా చెబుతాడు. ఆంధ్రప్రదేశ్‌లోని కోన సీమలో కొబ్బరి చెట్లకు తెగుళ్లే సోకి ఉం టాయి. వరుసగా వచ్చిన తుఫాన్‌లు ఇందుకు కారణమై ఉంటాయి. అయితే జరిగిన నష్టానికి ఎవరో కారణమై ఉంటారని, నరదృష్టి తగిలి ఉంటుందని మాట్లాడటం.. ఆలోచనలకు తెగులు పట్టిందని భావించాల్సి ఉంటుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములుగా కలిసి ఉండాలని తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు మాత్రం తెలంగాణపై ఇప్పటికీ అక్కసు పోయినట్టు లేదు. దీనికి తాజాగా కోనసీమకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే స్పష్టమైన నిదర్శనం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

రాష్ర్ట ప్రగతి, స్వాభిమానాన్ని అవమానపర్చేం త స్థాయిలో ఈ వ్యాఖ్యలు ఉన్నాయని తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందేనని పలువురు తెలంగాణ నాయకులు డిమాండ్ చేశారు. ఈ రాజకీయ దుమారం నేపథ్యంలో పవన్ కళ్యా ణ్ వ్యాఖ్యలపై జనసేన పార్టీ స్పందించింది. పవన్ వ్యాఖ్యలను వక్రీకరించా రంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది.

అయితే తెలంగాణ నాయకులు డిమాండ్ చేస్తున్నట్టుగా క్షమాపణ మాత్రం చెప్పలేదు. కేవలం వివరణతోనే సరిపెట్టారు. పవన్ తన వివరణలో ‘నా ఉద్దేశం తెలంగాణను అవమానపరచడం కాదు, రెండు రాష్ట్రాల అభివృద్ధి తేడా గురించి మాత్రమే చెప్పాను’ అని స్పష్టం చేశారు. కానీ దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని అపశకునంలా పేర్కొన్నందుకు స్పష్టమైన క్షమా పణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పవన్ వివరణను వారు డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంగా కొట్టిపారేస్తున్నారు. విభజన సందర్భంలో నాయకు లు, సినీతారలు, వ్యాపారవేత్తలు కేవలం రాష్ట్రంగా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ వారి కార్యకలాపాలన్నీ ఇప్పటికీ తెలంగాణ, హైదరాబాద్ నుంచే కొనసాగిస్తున్నారు. వారి వ్యాపారాలు, రాజకీ యాలు, సినిమాలు అన్ని ఇక్కడినుంచే నిర్వహించుకుంటూ కూడా తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతున్నారని తెలంగాణ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. 

పవన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు..

గత రెండు దశాబ్దాలుగా ఆంధ్ర అంశం ఎంతో సున్నితమైనది. ఈ క్రమంలో తెలంగాణపై పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో త్రీవ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణకు చెందిన ఆయా పార్టీలపై నాయకులు దీనిపై స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రగతి, పరిపాలన, సంక్షేమం వంటి అంశా ల్లో తెలంగాణను ఉదాహరణగా పేర్కొంటూనే, కోనసీమ సమస్యలను తెలంగాణ మీదకు నెట్టడం అన్యాయమంటూ విమర్శిస్తున్నారు.

తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున మా టల దాడి మొదలుపెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్‌రెడ్డి ప్ర భుత్వం రాష్ట్ర ప్రగతిని జాతీయ స్థాయిలో ప్ర దర్శిస్తుంటే ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరికాదు అంటూ మండిపడుతున్నారు.

ఇలా ఎవరు మాట్లాడినా ఊరుకునేది లేదని, ఇది తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవ సమస్య అని హెచ్చరిస్తున్నారు. రెండు రాష్ట్రాల మ ధ్యలో తిరిగి వైషమ్యాలను సృష్టించాలనే కు ట్రతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే క్ష మాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

అవకాశంగా మల్చుకుంటున్న కాంగ్రెస్..

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైన అవకాశంగా మల్చుకుంటున్నది. అందుకే దీనిపై బలంగా ప్రచారం చేస్తోంది. తద్వారా రెండు విధాలుగా లబ్ధి పొందాలని చూస్తుంది. ఒకవైపు జనసేన మిత్రపక్షంగా వ్యహరిస్తున్న బీజేపీని కట్టడి చేయడం, మరోవైపు తెలంగాణ ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని యోచిస్తున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్‌కు ఇది పెద్ద రాజకీయ అవకాశంగా మారుతున్నది.

తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నది. దీని ద్వారా ‘తెలంగాణ గౌరవం మా బాధ్యత’ అనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంది. అందుకే ఈ అవకాశాన్ని పంచాయతీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అజెండాగా భావిస్తున్నది.

పంచాయతీ ఎన్నికల్లో గ్రామీణ ఓటరు కీలకమైన నేపథ్యంలో భావోద్వేగంగా వినియోగించుకోవాలనుకుంటున్నది. ఇందులో భాగంగా పవన్ వ్యాఖ్యను గ్రామస్థాయి చర్చకు దారితీసి, బీజేపీ, జనసేన పార్టీలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన పార్టీలుగా ముద్రవేసే ప్రయత్నం చేస్తున్నది. 

మిత్రపక్షమైన బీజేపీ మౌనం..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన తాజా వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర ప్రతిచర్యలకు దారితీశాయి. తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీసేలా  ఉన్న వ్యాఖ్యలపై ప్రజలు, పార్టీల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ, పవన్ కల్యాణ్ అసలు క్షమాపణ చెప్పకుండా కేవలం వివరణతో విషయం ముగించుకోవాలనుకోవడం మరింత విమర్శలకు దారితీస్తుంది. ఇదిలా ఉండగా మిత్రపక్షమైన బీజేపీ పూర్తిగా మౌనంగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది.

ఏపీ ప్రభుత్వంలో బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నప్పటికీ తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఒక్క స్పందన కూడా లేకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఇది తెలంగాణ ప్రజల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేసినట్లే అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ కూడా బాధ్యత వహించాలని, పవన్ కళ్యాణ్ క్షమాపణ చేప్పేలా డిమాండ్ చేయాలని పలువురు అభిప్రాయ పడుతున్నారు.