calender_icon.png 2 February, 2026 | 11:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాలు దిగజారిపోయాయి

02-02-2026 12:00:00 AM

సికింద్రాబాద్ టీడీపీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్

సికింద్రాబాద్ ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఏపీ సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు మాట్లాడిన మాటలుక్షమించరానివి, రాజకీయాలు దిగజారిపోయాయి అనడానికి అంబటి రాంబాబు మాటలు నిదర్శనం అన్ని చేసిన పాపానికి సిగ్గుతో తలదించు కోవాల్సింది పోయి అచ్చోసిన ఆంబోతుల్లా అసత్యాలు ప్రచారం చేస్తూనాటకాలాడు తున్నారని సికింద్రాబాద్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

సందర్భంగా వల్లారపు శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ హద్దు అదుపులేకుండా నీచమైన బాష, బూతులతో నాయకులను కించపరుస్తూ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు సభ్యసమాజం సహించకూడదు. ఆయన శనివారం మాట్లాడిన బాష, రెచ్చగొడుతున్న తీరు చూస్తేంటే వైసీపీ నేతలు ప్రజాజీవితంలో ఉండడానికే అర్హులు కాదు, ఇటువం టి బూతులు భవిష్యత్తులో ఎవరూ మాట్లాడకుండా కేసు నమోదు చేసి సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అన్ని వల్లారపు శ్రీనివాస్ కుమార్ అన్నారు.