calender_icon.png 16 February, 2026 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుర పీఠం దక్కేదెవరికో?

16-02-2026 01:05:02 AM

ఇండిపెండెంట్ లకు బంఫర్ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు 

గద్వాల్‌లో వేడెక్కిన రాజకీయం 

గద్వాల, ఫిబ్రవరి 15 : గద్వాల మున్సిపాలిటిలో క్యాంపు రాజకీయాలు ఒక్కసారి వే డెక్కాయి. గద్వాల మున్సిపాలిటిలో 37 వా ర్డులకు గాను కాంగ్రెస్ కు 16, బీఆర్‌ఎస్ కు 11, బీజేపీకి 7, ఎంఐఎం 1, స్వతంత్రులు ఇద్ద రు గెలుపొందారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 19 కాగా ప్రస్తుతం ఏ ఒక్క ప్రధాన పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కకపోవడంతో అందరి చూపు 29, 32 వార్డుల నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులపై పోకష్ పెట్టారు.

శుక్రవారం ఎన్నికల ఫలితాల వెలువడిన నేప థ్యంలో స్వతంత్ర అభ్యర్థులను హైడ్రామా మద్య ప్రత్యేక వాహనాల్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి తరలించి అక్కడ మంతనాలు జరిపి నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా వారికి ప్రత్యేక బంపర్ ఆఫర్ లు ఇచ్చి హైదరబాద్ కు తరలించినట్లు సమాచారం.

మరో వైపు బీఅర్‌ఎస్, బీజేపీ పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. ఇద్దరి మద్య సయోద్య కుదిరితే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కైవసం చేసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇండిపెండెంట్ కౌన్సిలర్ లకు కీలక పదవులు ఇస్తామని, మాకు మద్దతు తెలుపాలని కోరినట్లు తెలుస్తోంది. ఈనెల 16న మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో గెలుపొందిన కౌన్సిలర్లు ఎటు వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.

నేడు చైర్మన్ ఎన్నిక 

 తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈనెల 16న మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు, పరోక్ష పద్ధతిలో కీలక పదవుల భర్తీ ప్రక్రియ పూర్తికానుంది. దీంతో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్న కాంగ్రెస్ బీఅర్‌ఎస్ పార్టీలు ఎవరికివారే ఎత్తుకు పై ఎత్తు వేస్తూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. ఎలాగైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి వేగంగా పావులు కదుపుతున్నారు. స్వతంత్రులను తమ వైపు తిప్పికుంటే మున్సిపల్ పీఠం దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు జిల్లా కేంద్రంలో జోరుగా చర్చ నడుస్తోంది.

క్యాంప్ రాజకీయాలు షురూ ..

గద్వాల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానం రసవత్తరంగా ఎన్నిక కానుంది. 37 వార్డుల గాను చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 19కాగా ప్రస్తుతం ఏ ప్రధాన పార్టీకి మెజార్టీ స్థానాలు దక్కలేవు. కాంగ్రెస్ కు 16, బీఆర్‌ఎస్ కు 11, బీజేపీకి 7, ఎంఐఎం 1, స్వతంత్రులు ఇద్దరు గెలుపొందారు. దీంతో కీలకంగా వ్యవహరించనున్న 29, 32 వార్డుల నుంచి గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ తమ వైపు లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఇందులో భాగంగా క్యాంప్ రాజకీయాల ను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ తో పాటు బీజేపీ, బీఆ ర్‌ఎస్ కౌన్సిలర్లు వారి అధినేతల ఆధ్వర్యంలో వేర్వేరు గా హైదరాబాదుకు క్యాంపుకు తరలి వెళ్లారు. ఈ క్యాంపులోనే చైర్మన్, వైస్ చైర్మన్ ల కేటాయింపు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇండిపెండెంట్ కౌన్సిలర్ లు మద్దతు ఇస్తారా లేదా బీజేపీ పార్టీ ఇటు బీఆర్‌ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తుందా అనేది సోమవారం తేలనున్నది. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణమే ఇండిపెండెంట్ కౌన్సిలర్ లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఆద్వర్యంలో ప్రత్యేక వాహనంలో హైదరబాద్ కు మకాం మార్చినట్లు పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు.

వీరితో పాటు మరో ఇద్ణరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పట్టణంలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ బీఆర్‌ఎస్ పార్టీ విప్ జారీ చేస్తే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్ లు మరో పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ పీఠం చేజిచుకోవడానికి బీఅర్‌ఎస్ బీజేపీ పార్టీలు మంతనాలు జరుపుతున్నట్లు, వారికి ఇండిపెండెంట్ లు మద్దతు తెలపకున్నా ఎక్స్ అఫిషియోతో చైర్మన్ పీఠం కైవసం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొనంటూన్నారు.