24 August, 2026 | 2:41 AM

ఆలయ కమిటీలతో రాజకీయాలు

24-08-2026 02:02 AM
  1. గ్రీన్‌హిల్స్ కాలనీలోని సాయిబాబా ఆలయంలో పోటాపోటీగా కమిటీల నియామకం 
  2. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలి 
  3. బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌చార్జి శ్రీరాములు యాదవ్

ఎల్బీనగర్, ఆగస్టు 23 : ఆలయాల్లో కమిటీల పేరుతో కాంగ్రెస్ నాయకులు రాజకీ యం చేస్తున్నారని బీజేపీ మహేశ్వరం ని యోజకవర్గం ఇన్ చార్జి అందెల శ్రీరాములు యాదవ్ విమర్శించారు. ఎన్టీఆర్ నగర్ డివిజన్ గ్రీన్ హిల్స్ కాలనీలోని శ్రీసాయినాథ్ మందిరం 2023లో కాలనీ వాసులు 7 మందితో ట్రస్ట్ సభ్యులతో కమిటి ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి దాతల సహకారంతో దేవాలయం అన్ని విధాల అభివృద్ది చే సుకున్నామని, ఇప్పుడు కొంత మంది కా ంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం అక్రమ ంగా దేవాలయంలో వచ్చి పూజారిపై దాడి చేసి,

ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, వారిపై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని శ్రీ సాయినాథ్ ఆలయ క మిటి అధ్యక్షుడు పల్లె వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పద్మజా సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం శ్రీ సాయినాథ్ మందిరంలో బీజేపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ చార్జి అందెల శ్రీరాములు యాదవ్, ఎల్బీనగర్ ఇన్ చార్జి సామ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలయ స్థలాన్ని కబ్జా చేయాలని ప్లాన్ చేస్తున్నారని అరోపించారు. దేవాలయానికి ఎలాంటి సంబంధం లేనివారితో కొత్త కమిటీని సృష్టించారని, ఆక్రమంగా దేవాలయం లో వచ్చి రాజకీయం చేస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ విషయంపై ఇప్పటికే ఎల్బీనగర్ డీసీపీకి, చైత న్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని అరోపించారు.

రెండు రోజులల్లో సమ స్య పరిష్కారం కాకపోతే ఆందోళన తీవ్ర వే స్తామని బీజేపీ నాయకులు హెచ్చరించారు.- దేవాలయం వద్ద శిలాఫలకం తొలగింపు.. తీవ్ర ఉద్రిక్తత గ్రీనీహిల్స్ కాలనీ  శ్రీసాయినాథ్ మందిరం వద్ద శుక్రవారం ఏర్పాటు చేసిన శిలాఫలకంను బీజేపీ నాయకులు తొలగించారు.

అక్కడే ఉన్న చైతన్యపురి పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం బీజేపీ నాయకులు అక్కడ ఏర్పటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తొలిగించారు. ఈ కా ర్యక్రమంలో బీజేపీ మాజీ కార్పొరేటర్ల నా యికోటి పవన్ కుమార్, ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, నాయకులు పిట్ట ఉపేందర్ రెడ్డి, వెంకటేశ్ గౌడ్, సంతోశ్, వెంకటేశ్ యాదవ్, రా ములు యాదవ్,  సురేశ్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.