పోల్ టాక్స్ రద్దు చేయాలి
జనగామ జూన్ 8 (విజయ క్రాంతి): కేబుల్ టీవీ ఆపరేటర్లకు భారంగా మారిన పోల్ టాక్స్ ను రద్దు చేయించాలని జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేబుల్ ఆపరేటర్లు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 30 ఏళ్లుగా సొంత పెట్టుబడితో కేబుల్ ఆపరేటర్లు కేబుల్ నెట్వర్క్ ఉపాధిగా చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా 50 వేల కుటుంబాలు జీవన ఉపాధి పొందుతున్నారని చెప్పారు.
పోళ్ళకు వైర్లు కట్టినందుకు ప్రతి స్తంభానికి గ్రామపంచాయతీ పరిధిలో 15 రూపాయలు, మున్సిపాలిటీ పరిధిలో 20 రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పోల్ టాక్స్ రద్దు చేయించాలని ఎమ్మెల్యే కోరారు.






