17 April, 2026 | 3:22 AM

పాలిటెక్నిక్ కాలేజీలో అడ్మిషన్ లు,ఉచిత పాలిసెట్ కోచింగ్

17-04-2026 01:23 AM

మెదక్, ఏప్రిల్ 16(విజయ క్రాంతి) : ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల మెదక్ నందు 2026-27 అడ్మిషన్లు, ఉచిత పాలిసెట్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ భవాని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం పొందగోరే విద్యార్థినుల కోసం కళాశాల యాజమాన్యం ప్రత్యేక

ఏర్పాట్లు చేస్తోంది. కళాశాలలో ప్రస్తుతం డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్దినుల కోసం అత్యాధునిక ల్యాట్లు, డిజిటల్ లైబ్రర్ మరియు అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం అందుబాటులో ఉన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థినుల కోసం కళాశాల ప్రాంగణంలోనే సురక్షితమైన ప్రభుత్వ హాస్టల్ సౌకర్యం కలదు.

పాలిసెట్-2026 పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థినుల కోసం కళాశాల ప్రాంగణంలో ప్రతి మంగళవారం, బుధవారం, గురువారం సాయంత్రం 4:00 గంటల నుండి 6:00 గంటల వరకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందనీ, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పాలిసెట్ (POLYCET) కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు పొందవచ్చు. కావున, టెన్త్ క్లాస్ పూర్తయిన విద్యార్దినులు ఈ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని మెదక్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.