12 May, 2026 | 12:10 AM

13న పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్

12-05-2026 12:00 AM

అమలులో ఒక్క నిమిషం నిబంధన

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి 

మంచిర్యాల డివిజన్ కో ఆర్డినేటర్ డినీల్ కుమార్

మంచిర్యాల, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13న జరి గే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్ 2026)కు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉ న్న అన్ని సెంటర్లలో సంబంధిత శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షకు మంచిర్యాల డివిజన్ లో 2,364 మంది విద్యార్థులు హాజరుకానుండగా ఇందుకోసం మంచిర్యాల పరిధిలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల, నస్పూర్ మండలాల్లో ఎనిమిది పరీక్షా కేం ద్రాలు ఏర్పాటు చేశారు. మూడేండ్ల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, వ్యవసాయ, వెటర్నరీ డిప్లోమా కోర్సులలో ప్రవేశం కోసం ఈ పరీక్ష బుధ వారం జరుగనుంది. 

అమలులో ఒక్క నిమిషం నిబంధన

పాలిసెట్ ఎంట్రన్స్ పరీక్ష 13న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష జరుగనుండగా గంట ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉండటంతో ఏమాత్రం ఆలస్యమైనా పరీక్షకు దూరం కానున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యంత పకడ్బంది ఏర్పాట్ల మధ్య జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు సకాలంలో చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి మంచి ఫలితాలు సాధించాలి.

గంట ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతి: - మంచిర్యాల డివిజన్ కో ఆర్డినేటర్ డినీల్ కుమార్

పాలిసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష మంచిర్యాల డివిజన్ కో ఆర్డినేటర్, సింగరేణి కాలరీస్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ డినీల్ కుమార్ కోరారు. ఒక గంట ముందు (ఉదయం 10 గంటల) నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నామన్నారు.

హడావుడి లేకుండా ఓఎంఆర్ షిట్ లోని వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా నింపాలని సూచించారు. హాల్ టికెట్ మీద ఫోటో ప్రింట్ కాని వారు ఒక పాస్పోర్టు సైజ్ ఫో టోతో పాటు ఐడీ ప్రూఫ్ (ఒరిజినల్ ఆధార్ కార్డు) వెంట తెచ్చుకోవాలని, సెల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబడవన్నారు. విద్యార్థులు హెచ్బీ లేదా 2బీ బ్లాక్ పెన్సిల్, బ్లూ లేదా బ్లాక్ పెన్ తప్పక వెంట తీసుకురావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదన్నారు.