15 August, 2026 | 3:38 AM

స్కిల్ యూనివర్సిటీ వద్దు.. పాలిటెక్నికే ముద్దు

15-08-2026 12:41 AM

గజ్వేల్లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన

గజ్వేల్, ఆగష్టు 14: పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయవద్దంటూ గజ్వేల్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్కిల్ యూనివర్సిటీ వద్దు.. పాలిటెక్నిక్నే ముద్దు అంటూ ర్యాలీ నిర్వహించి, అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తే తమ విద్య, భవిష్యత్తు దెబ్బతింటుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించి పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాగా కళాశాల సమయంలోనే విద్యార్థుల ర్యాలీకి కళాశాల అధ్యాపకులు అనుమతి ఇవ్వడం గమనార్హం.