22-07-2025 12:44:23 AM
ముస్తాబాద్: జూలై 21(విజయక్రాంతి)నీళ్లు లేక అటు వర్షాలు పడక రైతులు అల్లాడుతున్నారని బి ఆర్ ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఆవునూర్, తుర్కపల్లి, రామలక్షణపల్లె గ్రామాల బిఆర్‌ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలో చెరువులను,కుంటలను కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నింపాలని ఆవునూర్ చెరువు వద్ద రైతులతో ఆందోళన చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గతంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల కోసం నీళ్లు ఇచ్చిందని, ఎండాకాలంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని చెరువులు కుంటలు నీళ్లతో జలకళలాడాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత ఆలోచనతో నీటిని నింపడం లేదని ఆరోపించడం జరిగింది. నీళ్లు లేక,వర్షాలు లేక రైతులు అల్లాడుతున్నారని, ఇప్పటికైనా చిత్తశుద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆవునూర్,తుర్కపల్లి రామలక్ష్మణపల్లె బిఆర్‌ఎస్ నాయకులు,రైతులుపాల్గొన్నారు.