calender_icon.png 12 August, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుంగతుర్తిలో అలుగు పోస్తున్న చెరువులు

12-08-2025 08:34:28 AM

సోమవారం రాత్రి భారీగా కురిసిన వర్షం..

రైతుల కళ్ళలో ఆనందం..

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి(Thungathurthy) నియోజకవర్గంలో గడిచిన 10 రోజుల నుండి వర్షాలు అడుపు తెడుపుగా వర్షాలు పడడంతో చెరువులు కుంటలు కొద్దో గొప్పో నీళ్లు వచ్చి చేరాయి. సోమవారం రాత్రి 9 గంటలకు వర్షం మొదలుకొని రాత్రి 2 గంటల వరకు వర్షం పడడంతో, తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు చెరువులతోపాటు, మండలంలోని గొట్టిపర్తి వెంపటి, రావులపల్లి ,తూర్పు గూడెం, వెలుగుపల్లి పెద్ద చెరువులు ఒక్కసారిగా పూర్తిగా నిండి, అలుగులు పడడంతో ఒక ప్రక్క యువత మరొక ప్రక్క రైతులు అలుగు ప్రదేశాలకు వెళ్లి, నీటిలో కేరింతల కొడుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షం వరితోపాటు, కంది, పత్తి పంటలకు జీవం పోసినట్లు అయిందని, పలువురు రైతులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గ్రామాల్లోని ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ తెలియపరిచారు.